NTV Telugu Site icon

Harish Rao: రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని ప్రచారం చేస్తున్నారు..

Harish Rao

Harish Rao

Harish Rao: రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో నరేందర్‌రెడ్డిని కలిసిన హరీష్ రావు. రేవంత్‌ రెడ్డికి మేం భజన చేయాలా.? అని మండిపడ్డారు. పట్నం నరేందర్‌ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్షనేతగా నరేందర్‌ రెడ్డి రైతులకు మద్దతు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని ప్రచారం చేస్తున్నారని హరీష్‌ రావు మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టై నిన్న చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు చేరుకుని హరీష్ రావు ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా చర్లపల్లి జైలుకు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పట్నం నరేందర్ రెడ్డికి ఈ కుట్ర కేసుతో ఏమీ సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత కొడంగల్ నుండే ప్రారంభమయ్యిందన్నారు. ఉద్యమాలు, కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు. అన్యాయంగా పేద ప్రజల భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. అక్రమంగా నరేందర్ రెడ్డిని అరెస్టు చేసినా, అక్రమ కేసులు పెట్టినా ప్రజల తిరుగుబాటు కొడంగల్ నుండే ప్రారంభమయ్యింది అన్నారు.
Bhatti Vikramarka: పరిశ్రమలు పెట్టాలని చేసేది ప్రభుత్వ వైఫల్యమా? కేటీఆర్‌కు భట్టి కౌంటర్..

Show comments