NTV Telugu Site icon

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్టు.. ఇంటి ముందు బ్యారికేడ్లు..

Harish Rao

Harish Rao

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొకపెట్ లోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావును కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదు. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావును కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని ,మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ కమిషనర్ అనుమతి ఇస్తేనే హరీష్ రావుని కలవనిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. తమ ఎమ్మెల్యేను కలవడానికి మీకు అనుమతి ఇవ్వాలని, మీకెందుకు అభ్యంతరం అని డిమాండ్ చేశారు. అయినా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు వాగ్వాదం చోటుచేసుకుంది.

Read also: Telangana DGP: ట్రై కమిషనరేట్లలో శాంతి భద్రతలపై రాజీ పడద్దు.. డీజీపీ ఆదేశం

ఉదయం 11 గంటలకు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసంలో బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. అయితే గాంధీ ఇంటికి వెళుతున్న పలు నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్లకుండా ఇంటి ముందు పోలీసుల పహారా కాస్తున్నారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. బోయినపల్లి లో ఆయన నివాసంలో ఇంట్లోనే పోలీసులు ఉంచారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హౌస్ అరెస్ట్ చేశారు. అయితే గాంధీ ఇంటికి వెళుతున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ ఎంఎల్ఏ ఇంటికి పోతే తప్పు ఏంటి..? అని ప్రశ్నించారు. దానం నీ అనుమతించి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు.

Read also: Sitaram Yechury : సీతారాం ఏచూరి తర్వాత సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎవరంటే?

అయితే ఈనేపథ్యంలో హరీష్ రావు ట్వీట్ చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల అక్రమ అరెస్టులపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన బీఆర్‌ఎస్‌ ర్యాంకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే గాంధీని, వారి అనుచరులను, ఎమ్మెల్యేపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు.

Voter ID: క్యూఆర్‌ కోడ్‌తో ఓటరు దరఖాస్తులు..ఎన్నికల సంఘం మరో సదుపాయం