Site icon NTV Telugu

వికలాంగ టీచర్ విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. పిల్లల ఫోటోలతో?

చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్ దోమల్ గూడలో జరిగింది. గగన్ మహల్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ కీచక టీచర్ ఉదంతం బయటపడింది. పిల్లల ఫోటోలు తీస్తూ బెదిరించాడు, తాను చెప్పినట్లు వినాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఈ కీచక టీచర్ శ్రీనివాస్ ప్రవర్తనతో విద్యార్థినులు స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నారు.

తల్లిదండ్రులు విషయం తెలుసుకొని స్కూల్ లో టీచర్ ను నిలదీశారు. గత కొంతకాలంగా పిల్లలతో, తోటి మహిళ టీచర్ లతో శ్రీనివాస్ ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తన వైఖరిలో మార్పు రాలేదంటున్న స్కూల్ హెచ్ఎం జ్యోతిమయి తెలిపింది. కీచక టీచర్ వికలాంగుడు కావడంతో, దాడి చెయ్యకుండా పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించారు.

Exit mobile version