NTV Telugu Site icon

TSPSC Group-3: రేపటి నుంచే గ్రూప్‌–3 పరీక్షలు.. రెండు రోజుల పాటు 3 పరీక్షల నిర్వహణ ..

Tspsc Group 3 Exam

Tspsc Group 3 Exam

TSPSC Group-3: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు రెండు పరీక్షలు, రెండో రోజు ఒక పరీక్షలు నిర్వహిస్తారు. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు.పేపర్-3 పరీక్ష 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో జరిగే గ్రూప్-3 పరీక్షలకు 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 గ్రూప్-3 పోస్టుల భర్తీకి డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ విడుదలైంది.

Read also: Rajanna Sircilla: జాతరలో కుక్క స్వైరవిహారం.. 21 మందిపై దాడి..

రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-3 పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించింది. పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని టీజీపీఎస్సీ కార్యాలయానికి అనుసంధానం చేసి నేరుగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. గ్రూప్-3 అభ్యర్థులను పరీక్ష సమయానికి గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందుగా చేరుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే సెంటర్ల గేట్లను మూసివేస్తామని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లు మరియు ప్రశ్నపత్రాలను భద్రంగా ఉంచుకోవాలని TGPSC సూచించింది. డూప్లికేట్ హాల్ టిక్కెట్లు జారీ చేయబడవు.
Musi River: మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర.. ఇవాళ, రేపు బస అక్కడే..

Show comments