Missing Case: హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికల మిస్సింగ్ ఘటన సుఖాంతం అయ్యింది. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్ లోని చీరాల సూర్యలంక బీచ్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీ దుర్గ, హారిక కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ శ్రీ చైతన్య కళాశాలలో 8వ తరగతి చదువుకుంటున్నారు. కళాశాలకు వెళ్లిన వారు మళ్లీ తిరిగి ఇంటి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read also: Mallu Bhatti Vikramarka: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
కుటుంబ సభ్యులు, కళాశాల యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు బాలికల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని చీరాల సూర్య లంక బీచ్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తోటి సహ విద్యార్థినులు ద్వారా పోలీసులు సమాచారం సేకరించారు. విద్యార్థుల ఆచూకీ ఏపీలో గుర్తించారు. దీంతో ఏపీ పోలీసులకు కూకట్ పల్లి పోలీసులు సమాచారం అందించారు. అదృశ్యమైన లక్ష్మీ దుర్గ, హారికను హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. లక్ష్మీ దుర్గ, హారిక ఏపీకి ఎలా వెళ్లారు అనేదానిపై ఆరా తీస్తున్నారు. బీచ్ ఎందుకు వెళ్లారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.
Read also: M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోండి..
మరోవైపు జగిత్యాల జిల్లా నాచుపెల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్ధి అదృశ్యం ఘటన కలకలం రేపింది. నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో హితీష్ మెకానికల్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. రెండు రోజుల నుండి కనబడకపోవడంతో కుమారుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోయినందున మనస్థాపానికి గురై తన అక్కకు తల్లిదండ్రులకు ఫోన్లో జాగ్రత్తలు అని చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. హితీస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
CV Anand: పోలీస్ ఉద్యోగం అంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లాంటిది..