Missing Case: హైదరాబాద్ లో అదృశ్యమైన బాలికలు ఏపీ సూర్యలంక బీచ్ లో ప్రత్యక్షం..
- కూకట్ పల్లిలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికల మిస్సింగ్ ఘటన సుఖాంతం..
- ఆంధ్రప్రదేశ్ లోని చీరాల సూర్యలంక బీచ్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missing Case: హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికల మిస్సింగ్ ఘటన సుఖాంతం అయ్యింది. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్ లోని చీరాల సూర్యలంక బీచ్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీ దుర్గ, హారిక కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ శ్రీ చైతన్య కళాశాలలో 8వ తరగతి చదువుకుంటున్నారు. కళాశాలకు వెళ్లిన వారు మళ్లీ తిరిగి ఇంటి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read also: Mallu Bhatti Vikramarka: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
Also Read
- Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
- HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
- Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
- Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
కుటుంబ సభ్యులు, కళాశాల యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు బాలికల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని చీరాల సూర్య లంక బీచ్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తోటి సహ విద్యార్థినులు ద్వారా పోలీసులు సమాచారం సేకరించారు. విద్యార్థుల ఆచూకీ ఏపీలో గుర్తించారు. దీంతో ఏపీ పోలీసులకు కూకట్ పల్లి పోలీసులు సమాచారం అందించారు. అదృశ్యమైన లక్ష్మీ దుర్గ, హారికను హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. లక్ష్మీ దుర్గ, హారిక ఏపీకి ఎలా వెళ్లారు అనేదానిపై ఆరా తీస్తున్నారు. బీచ్ ఎందుకు వెళ్లారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.
Read also: M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోండి..
మరోవైపు జగిత్యాల జిల్లా నాచుపెల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్ధి అదృశ్యం ఘటన కలకలం రేపింది. నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో హితీష్ మెకానికల్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. రెండు రోజుల నుండి కనబడకపోవడంతో కుమారుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోయినందున మనస్థాపానికి గురై తన అక్కకు తల్లిదండ్రులకు ఫోన్లో జాగ్రత్తలు అని చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. హితీస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
CV Anand: పోలీస్ ఉద్యోగం అంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లాంటిది..
తాజావార్తలు
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!