Site icon NTV Telugu

Krishnamohan Reddy: టెక్నికల్‌గా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. స్పీకర్ నోటీసుపై గద్వాల ఎమ్మెల్యే ప్రకటన

Gadwal Mla Krishnamohan Red

Gadwal Mla Krishnamohan Red

టెక్నికల్‌గా తానింకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఎన్టీవీతో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్‌లపై గద్వాల ఎమ్మెల్యే స్పందించారు. మా కార్యాలయానికి స్పీకర్ నోటీస్ పంపారని తెలిపారు. నోటీస్‌పై న్యాయనిపుణులతో మాట్లాడి రిప్లై ఇస్తానన్నారు. అభివృద్ది లక్ష్యంగానే తన చర్యలు ఉంటాయని చెప్పారు. తన నియోజక వర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్లు చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Online Payment: 2 కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన ఆన్‌లైన్ పేమెంట్.. చివరికిలా..!

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం స్పీకర్ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యాక్షన్‌లోకి దిగారు. వచ్చే వారం నుంచి విచారణ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వారి విచారణ ముగిసిన తర్వాత మరికొందరికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Rasha Tadaney : టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ అందుకున్న..రాషా తడానీ !

Exit mobile version