Gachibowli Fly Over: గచ్చిబౌలి ఫ్లై ఓవర్ క్లోజ్.. ఎప్పటి వరకు అంటే..
- హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన..
- గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు..
- రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు..
- మిగిలిన సమయంలో వాహనాలు వెళ్లే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gachibowli Fly Over: హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ క్రమంలో నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ అభివృద్ధి పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయానికి గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎస్ఆర్డిపి పనుల్లో భాగంగా గత కొంతకాలంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఈ కారణంగా అక్టోబర్ 28 వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. అయితే.. మిగిలిన సమయంలో వాహనాలు వెళ్లే అవకాశం ఉంది. అయితే రాత్రి 11 గంటల తర్వాత ప్రయాణించే వారు ఈ వారం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు.
Rifle Bullets In Train: వందలాది రైఫిల్ బుల్లెట్లతో రైలులో ప్రయాణించిన అమ్మాయి
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
- Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!