NTV Telugu Site icon

TG High Court: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు పోలీస్ విచారణకు రావాల్సిందే..

Shakeel

Shakeel

TG High Court: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహెల్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఈ నెల 16వ తేదీన పంజాగుట్ట పోలీసుల ముందు సాహెల్ హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రజా భవన్ గేట్స్ ను రాష్ డ్రైవింగ్ తో షకీల్ కొడుకు సాహెల్ ఢీ కొట్టాడని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కేసు ఫైల్ అయినా తర్వాత సాహెల్ దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న సాహెల్ హైదరాబాద్ రావాల్సిందేనని.. పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు నాగబాబు కీలక ట్వీట్

అయితే, ప్రజాభవన్ గేట్లను ఢీకొన్న కారు కేసులో సాహెల్ ను తప్పించి డ్రైవర్ అసిఫ్ ను నిందితుడిగా చేర్చేందుకు పంజాగుట్ట సీఐ దుర్గారావు చేసిన ప్రయత్నం బయటకు రావడంతో.. ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు. ఇందులో బోధన్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్, అబ్ధులా వాహేద్ ను కూడా నిందితులుగా చేర్చడంతో.. మొత్తం ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాహెల్ దుబాయ్ పారిపోయేందుకు డ్రైవర్ అసిఫ్ సహకరించగా.. అర్షద్, సోహెల్ లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్, సాహెల్ కోసం పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు.

Show comments