NTV Telugu Site icon

Telangana: జిల్లాలను కమ్మేసిన పొగమంచు.. హెడ్ లైట్ల వెలుతురులో ప్రయాణం..

Foge

Foge

Telangana: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను పొగమంచు కమ్మేసింది. జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాను పొగ‌మంచు దుప్పటిలా క‌మ్మేసింది. ప‌ల్లెలే కాదు.. జిల్లా కేంద్రం కశ్మీరాన్ని త‌ల‌పిస్తుంది. ఇవాళ ఉద‌యం నుంచే ద‌ట్టంగా పొగ‌మంచు కురుస్తుండ‌టంతో ర‌హ‌దారిపై హెడ్ లైట్ల వెలుతురులో నెమ్మదిగా వాహ‌నాలు ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో చలి గణనీయంగా పెరిగింది. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజురోజుకి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం పనులకు వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది. జిల్లాల్లో ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో కశ్మీరాన్ని తలపిస్తుంది. ఉదయం రహదారుల్లో నడవాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎదుటి వాహనాలు కూడా మంచులో కనిపించకపోవడంతో రహదారుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంంటున్నారు.

Read also: Bhadradri: భద్రాద్రికి కార్తీక శోభ.. శివాలయంలో నేటి పూజలు..

జిల్లాలకు కమ్మేసిన పొగమంచు..

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పొగమంచు కురుస్తుంది. ఉదయం 6.30 గంటలైనా జగిత్యాల – నిజామాబాద్ జాతీయ రహదారి కనపడటం కష్టంగా మారింది. దీంతో వాహనదారులు హెడ్ లైట్ల వెలుతురులోనే నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ఎదుట పొగమంచు కమ్ముకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాని పొగమంచు కమ్మేసింది. సంగారెడ్డి, కంది, రుద్రారం, జోగిపేట, చౌటకూర్ ప్రాంతాల్లో మంచు దట్టంగా కమ్మేసింది. ఔటర్ రింగ్ రోడ్డు, NH-65, NH-161 పై వాహనాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. వాహనాల హెడ్ లైట్ లు, ఇండికేటర్ వేసుకుని వాహనదారులు నెమ్మదిగా వస్తున్నాయి. స్కూల్, ఉద్యోగాలకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read also: Karthika Masam: ఆ చెట్టు కింద భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం ఫలితం దక్కుతుంది..

మరోవైపు పటాన్చెరు, రామచంద్రపురం, లింగంపల్లి ,అవుటర్ రింగ్ రోడ్డు ,ముత్తంగి, ఇస్నాపూర్ లో పొగ మంచు కమ్మేసింది. వాహనదారులు తమ వాహనాలకు లైట్లు ఆన్ చేసుకొని నడుపే పరిస్థితి వచ్చింది. పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులకు పాదచారులు కనిపించడం కష్టంగా మారింది. విద్యార్థులకు స్కూల్ టైం, ఆఫీస్ వాళ్లకు జాబ్ టైం రోడ్డు క్రాస్ చేయాలంటే పొగ మంచు కారణంగా ఇబ్బంది పడుతున్నారు. పొగ మంచు కారణంగా ఎదుటి వాహనాలు కనిపించడం లేదు. దీంతో జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయవలసి వస్తుంది. వికారాబాద్ జిల్లాలో భారీగా మంచు కమ్మేయడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనచోదకులు దగ్గరికి వచ్చే వరకు ఒక వాహనానికి మరో వాహనం కనబడకుండా ఇబ్బంది పడుతున్న వాహనదారులు వాపోతున్నారు.
Bhadradri: భద్రాద్రికి కార్తీక శోభ.. శివాలయంలో నేటి పూజలు..

Show comments