హైదరాబాద్‌లోని నారాయణగూడాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నారాయణగూడాలోని అవంతి నగర్‌లో ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో సడెన్ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురిని కాపాడి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఆగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. ఇక, ఈ అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదంటే మరేమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.