NTV Telugu Site icon

KTR Comments: ఫార్మ్ హౌస్ ను నేను లీజుకు తీసుకున్నాను..

Ktr

Ktr

KTR Comments: నాకంటూ ఎలాంటి ఫార్మ్ హౌస్ లేదని కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. నా మిత్రుడి ఫార్మ్ హౌస్ ను నేను లీజుకు తీసుకున్నానని అన్నారు. ఎఫ్.టి.ఎల్ లో వుంటే నేనే దగ్గర ఉండి ఫార్మ్ హౌస్ ను కూలగొట్టిస్తా అన్నారు. కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి, నేతలు కె.వి.పి రామచంద్రరావు
పట్నం మహేందర్ రెడ్డి,గుత్తా సుఖేందర్ రెడ్డి,వివేక్ వెంకటస్వామి ఫార్మ్ హౌస్ లను కూల్చాలన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫార్మ్ హౌస్ నుండి స్టార్ట్ చేద్దామన్నారు. నాకు ఎలాంటి ఫార్మ్ హౌస్ లేదు.. వివేక్ వెంకటస్వామి ఫార్మ్ హౌస్ నీళ్ళల్లో ఉందన్నారు. నా అఫిడవిట్ పబ్లిక్ డొమైన్ లో ఉందన్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోండన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల నుండి స్టార్ట్ చేయండి అని డిమాండ్ చేశారు. రేపు చేవెళ్లలో జరిగే రైతు నిరసన కార్యక్రమంలో నేను పాల్గొంటానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు.

Read also: Botsa Satyanarayana: ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం.. అభినందించిన జగన్‌

రుణమాఫీ బూటకం అని తెలిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీతిమాలిన రాజకీయాలు చేస్తోందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులకు టోపీలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదన్నారు. రుణమాఫీపై రైతులు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు స్వచ్ఛందంగా ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. రైతులపై అక్రమ కేసులు పెట్టి అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తలమడుగు, బజార్ హత్నూర్ మండలంలో రైతులపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేశారన్నారు. ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల అంటున్నారని.. సీఎం,మంత్రుల మధ్య సమన్వయం లేదన్నారు. డిప్యూటీ సీఎం చెప్పిన లెక్కల ప్రకారం రుణమాఫీ ఒట్టిదే అన్నారు.

Read also: Pawan Kalyan-OG: ఇక డీజే కాదు.. ‘ఓజీ’ మోతనే!

ఇంకా 12 వేల కోట్ల రుణమాఫీ కావాల్సి ఉందని మంత్రి పొంగులేటి చెప్తున్నారని అన్నారు. రుణమాఫీ విషయంలో రైతులను వంచన చేశారన్నారు. రుణమాఫీ 40 శాతం కాలేదని..రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో,నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చెప్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని, రేపు ధర్నాలో పాల్గొనే ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్ నేతలు పూల మాల వేయాలని సూచించారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి రైతుల పక్షాన ఉంటామన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు నీళ్లు పుష్కలంగా ఇచ్చామన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చామన్నారు. రెండు విడతలుగా రుణమాఫీ చేశామన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు తగ్గిన రాష్ట్రంగా తెలంగాణను బీఆర్ఎస్ నిలిపిందన్నారు. వ్యవసాయ స్థిరీకరణ కోసం కొర్రీలు పెట్టకుండా రైతు బంధు ఇచ్చామన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో 20,239 రైతుల ఖాతాలు ఉంటే 8,527 మందికి మాత్రమే రుణమాఫీ అయిందన్నారు.

Read also: Terrible Incident: సిద్దిపేటలో దారుణం.. ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం..

బొమ్మరాసిపేట మండలంలో కోట యాదగిరి కుటుంబంలో నలుగురికి రైతు రుణాల ఉంటే ఒక్కరికి మాత్రమే మాఫీ అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి మోసగాళ్ల ప్రభుత్వం అని మండిపడ్డారు. 7,500 కోట్లకే రైతు రుణమాఫీని ముగించాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. కడుపు కట్టుకుని 40 వేల కోట్లు ఇస్తామని సీఎం అన్నారు.49 వేల కోట్ల నుండి 7,500 కోట్లకు రైతు రుణమాఫీని కుదించారన్నారు. రాష్ట్రంలో కోతల రాయుళ్ల ప్రభుత్వం నడుస్తోందన్నారు. రైతులను సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ,రైతు భరోసా ఇచ్చే వరకు వెంటపడుతామన్నారు. రైతులపై కేసులు ఉపసంహరించుకోండన్నారు. రైతులపై కేసులు ఆపకపోతే భవిష్యత్ లో జైల్ భరో కార్యక్రమం చేపడతామని, రేవంత్ రెడ్డి చీటింగ్ పై మా ఫైటింగ్ ఆగదన్నారు. కొండారెడ్డిపల్లిలో అందరికి రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీ వివరాలు ఇవ్వొద్దని.. వ్యవసాయ శాఖ అధికారులను బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bus Accident: భయానక రోడ్డు ప్రమాదం.. 30 మంది మృతి.. 23 మందికి గాయాలు..