NTV Telugu Site icon

Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. పోలీసులతో వాగ్వాదం..!

Vallabhaneni Vamsi Arrest

Vallabhaneni Vamsi Arrest

Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీని అరెస్ట్‌ చేశారు ఏపీ పోలీసులు.. అయితే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ.. అయితే, ఈ కేసుపై బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు వంశీ.. కానీ, తీర్పు రావాల్సి ఉండగానే ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారంటూ.. ఏపీ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారట వల్లభనేని వంశీ..

Read Also: Fire Accident: జనగామలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా 88 మందిపై కేసు పెట్టారు.. పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.. ఇక, ఈ కేసులో ఈ నెల 20వ తేదీన వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది.. మరోవైపు.. హఠాత్తుగా ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ ఈ కేసుకు, తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇవ్వడంతో ఈ కేసులో పెద్ద ట్విస్ట్‌ ఇచ్చినట్టు అయ్యింది.. మరోవైపు.. మట్టి తవ్వకాలకు సంబంధించి.. మరో కేసు కూడా వల్లభనేని వంశీపై నమోదు అయినట్టుగా సమాచారం.. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది..

Read Also: Harish Rao : ఈ వ్యాఖ్యలు గౌరవ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చోటి సోచ్ కి నిదర్శనం

ఇక, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై కోర్టులో కేసుని వెనక్కి తీసుకున్న సత్య వర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయినట్లు సమాచారం.. కోర్టులో పిటిషన్ సత్య వర్ధన్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు అనే దానిపైన పోలీసులు విచారణ చేపడితే.. వంశీతో పాటు అనతి అనుచరులు సత్య వర్ధన్ బెదిరించడంతో అతను కేసును వెనక్కి తీసుకున్నట్లుగా పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. ఈ స్టేట్‌మెంట్‌ ఆధారంగానే పోలీసులు వల్లభనేని వంశీ మోహన్‌తో పాటు.. అతని అనుచరులపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని చెబుతున్నారు.. ఈ నేపథ్యంలోనే పోలీసులు వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి.. విజయవాడ తరలిస్తున్నట్టుగా సమాచారం..