NTV Telugu Site icon

Patnam Narender Reddy: నా పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్‌ రిపోర్ట్‌ తప్పు..

Patnam

Patnam

Patnam Narender Reddy Reacts on Remand report in Lagcherla Incident: లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో అరెస్ట్ చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చారు. పోలీసులు నా పేరుతో నిన్న బయటకు వచ్చిన కన్ఫెషన్ రిపోర్టు తప్పు అని తెలిపారు. కేటీఆర్ గురించి కానీ, ఈ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు నా నుంచి తీసుకోలేదు నేను చెప్పలేదు అని వెల్లడించారు. కోర్టుకు వచ్చాక నా అడ్వొకేట్ అడిగితె రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు అని పేర్కొన్నారు. అప్పటి వరకు నాకు అందులో ఏముందో తెలియదు అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Read Also: Piaggio Vespa: మరింత శక్తివంతంగా వెస్పా GTS 310..

ఇక, నేను పోలీసులకు చెప్పనిదే చెప్పినట్లు రాశారు అని కొండగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. నేను ఎవరి పేరు కూడా చెప్పలేదు.. పోలీసులు కావాలనే అలా రిమాండ్ సృష్టించారు అని ఆరోపించారు. అయితే, రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును పోలీసులు చేర్చారు. దాడి వెనక కేటీఆర్ ఉన్నట్లు నరేందర్ రెడ్డి అంగీకరించాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. కాగా, బెయిల్ కోసం వికారాబాద్ జిల్లా కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.. ఈ విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు నరేందర్ రెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

Show comments