NTV Telugu Site icon

Etela Rajender: ఫార్మా కంపెనీలకు రైతుల భూములు అప్పజెప్పే ప్రయత్నం.. ఈటల ఫైర్

Eteala Rejender

Eteala Rejender

Etela Rajender: ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. లగిచెర్ల అరెస్టుల ఘటనపై ఢిల్లీ నుండి ఈటల రాజేందర్ స్పందించారు. లగిచెర్ల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరిస్తున్నాము. వారి మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందన్నారు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదని కీలక వ్యఖ్యలు చేశారు. లగిచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. దీనిని అక్కడ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు.

Read also: Komati Reddy Counter: కేటీఆర్ వ్యాఖ్యలకు కోమటి రెడ్డి గట్టి కౌంటర్

మా భూములు గుంజుకోకండి, మా ఉపాధి మీద దెబ్బకొట్టకండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. వినకుండా ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేశారు, నిరసనలు తెలిపారన్నారు. గ్రామసభలను బహిష్కరించారన్నారు. స్వయంగా ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ధర్నాలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ వారి మాట పెడచెవిన పెట్టి ప్రభుత్వం భూసేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేసింది. దీనితో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారని స్పష్టం చేశారు. దీనిని అడ్డం పెట్టుకొని కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాలలో మోహరించి అరెస్టు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరిస్తున్నామని తెలిపారు. భూ సేకరణ రైతుల ఇష్ట ప్రకారం చేయాలి తప్ప బలవంతంగా తీసుకునే అధికారం మీకు ఇవ్వలేదు.

Read also: Phone Tapping: కేసులో కీలక పరిణామం.. నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..

గతంలో ముచ్చర్లలో ఫార్మసిటీ కోసం 8 లక్షలకు భూములు సేకరించి కోటి రెండు కోట్లకు ఫార్మా కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని, బీజేపీగా మేము కూడా వ్యవహరించే వ్యతిరేకించామన్నారు. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పరమైన భూములు ఇవ్వండి కానీ ప్రైవేటు వ్యక్తుల భూములు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన చేస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. పేదల భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టి ఆ భూములతో డబ్బులు సంపాదించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఫార్మాసిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజానికంపై ప్రభుత్వం చేస్తున్న దుచ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. అక్రమ అరెస్టులు చేసి, వారి మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు. ప్రజలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుదాం. మేమంతా మీకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు.
Komati Reddy Counter: కేటీఆర్ వ్యాఖ్యలకు కోమటి రెడ్డి గట్టి కౌంటర్