TG High Court: వీధి కుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయినా ఉదాసీనంగా వ్యవహరిస్తూ వెనుకడుగు వేయబోమని హెచ్చరించింది. చిన్నారులు, ప్రజలపై కుక్కల దాడి నేపథ్యంలో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు విచారణ చేపట్టింది. మరణాలకు కారణమవుతున్న వీధికుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని విచారణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వీధికుక్కల నివారణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని, వ్యాక్సినేషన్ వేయడం లేదని, సరైన ఆహారం అందక ప్రజలపై దాడులు జరుగుతున్నాయని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
Read also: KTR Tweet: ఈ మహా నగరానికి ఏమైంది..? ట్విట్టర్ లో కేటీఆర్
గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ బాగ్‌లోని అంబర్‌పేటలో పాఠశాల విద్యార్థినిపై దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. విద్యార్థి మృతిపై వచ్చిన కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణించింది. గత నెలలో కూడా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బీహార్‌కు చెందిన వలసకు వచ్చిన దంపతుల ఆరేళ్ల కుమారుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఆ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటనలపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వకపోగా, బాధ్యత ముగిసిందనుకుని భావించొద్దని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అనుపమ్ త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే…
Road Accident : స్కూల్ బస్సు ప్రమాదంలో డ్రైవర్ తో సహా 12మంది చిన్నారులు మృతి