KTR Tweet: ఈ మహా నగరానికి ఏమైంది..? ట్విట్టర్ లో కేటీఆర్
- కాంగ్రెస్ పరిపాలనపై కేటీఆర్ ట్విట్..
- హైదరాబాద్ కేవలం రాజధాని కాదని తెలంగాణ ఎకనమిక్ ఇంజన్..
- ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే.. మన హైదరాబాద్ దెబ్బతినే పరిస్థితి..
- దీని వల్ల రాష్ట్రానికికే కాదు యావత్ దేశానికి కూడా నష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో అలర్ట్ గా వుంటారు. ప్రతి విషయాన్ని షేర్ చేసి అందరితో పంచుకుంటుంటారు. ట్విట్ ద్వారా ఏవైన సమస్యల గురించి చెప్పినా వెంటనే స్పందిస్తారు కేటీఆర్. అయితే కాంగ్రెస్ పరిపాలనపై ట్విట్ చేశారు. హైదరాబాద్ అంటే.. కేవలం రాజధాని కాదని.. తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ అని తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే.. మన హైదరాబాద్ దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. దీని వల్ల రాష్ట్రానికి కష్టమే కాదు..
యావత్ దేశానికి కూడా నష్టం.. అంటూ కేటీఆర్ ట్విట్ చేశారు.
“ఈ మహా నగరానికి ఏమైంది..?”
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాదు నుండి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోంది!
“బ్రాండ్ హైదరాబాద్”
ఎందుకు మసకబారుతోంది ??
విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ..
ఎందుకింత కళ కోల్పోతోంది ???
సగటు హైదరాబాదీకి
కలుగుతున్న భావన ఇది..!
హైదరాబాద్ ను ప్రేమించే
ప్రతిఒక్కరిలో ఉన్న ఆవేదన ఇది..!!
పదేళ్ళు ప్రశాంతంగా ఉన్న నగరంలో
పెరిగిపోతున్న వరుస హత్యలు..
పేట్రేగిపోతున్న అంతరాష్ట్ర ముఠాలు..
రాజధాని హైదరాబాద్ లో శాంతి లేదు..
నగర ప్రజల జీవితాలకు భద్రత లేదు..
సీఎం గారు స్వయంగా…
పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్నా..
పోలీసింగ్ పై కమాండ్ ఏది..?
క్షీణిస్తున్న శాంతిభద్రతలపై కంట్రోల్ ఏది..??
ఓవైపు..
కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం..
పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోంది.
మరోవైపు..
పడగవిప్పిన హత్యల సంస్కృతి..
ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోంది.
ఇంకోవైపు..
తరలిపోతున్న పెట్టుబడుల పర్వం..
యువత ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోంది.
కాంగ్రెస్ పవర్ లోకి రాగానే
గడియ గడియకు ఏమిటీ.. పవర్ కట్ ?
సేఫ్ సిటీ గా ఉన్న మహానగరంలో..
ఎందుకు పెరుగుతోంది.. క్రైం రేట్ ??
ఇదేనా మీరు తెస్తానన్న మార్పు ?
విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి..
పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే..
అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా ?
ప్రపంచంతో పోటీపడే నగరంగా
ఎదుగుతున్న హైదరాబాద్ ప్రగతికి
అర్ధాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా ??
దేశ రాజధాని చుట్టూ..
రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ..
చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న
రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా ???
హైదరాబాద్ అంటే..
కేవలం రాజధాని కాదు..
“తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ ”
ఇకనైనా..
కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే..
మన హైదరాబాద్ దెబ్బతింటే..
రాష్ట్రానికి కష్టమే కాదు..
యావత్ దేశానికి కూడా నష్టం.. అంటూ కేటీఆర్ ట్విట్ చేశారు.
Realtor Murder: రియల్టర్ హత్య కేసులో ట్విస్ట్.. రెండో పెళ్లితో కొడుకులు మర్డర్ ప్లాన్..?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు