Site icon NTV Telugu

CM Revanth Reddy: కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికే లక్షా 2 వేల కోట్లు అప్పు తెచ్చినా..

Rr

Rr

CM Revanth Reddy: రవీంద్ర భారతిలో జరుగుతున్న మేడే వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారానికి ఒకరోజు సెలవు.. కార్మికుల పోరాట ఫలితమే అన్నారు. ఇక, తెలంగాణలో ఆర్ధిక మాంద్యం తక్కువ ఉందన్నారు. సింగరేణిలో ఔట్ సోర్సింగ్ కార్మికులకు మొదటి సారి మనమే బోనస్ ఇచ్చాం.. సింగరేణిని నిర్వీర్యం చేశారు పదేళ్లు.. కారుణ్య నియామకాలు సరళీకృతం చేశాం.. ఒక కుటుంబమే 7 లక్షల కోట్లు అప్పు చేసింది అని ఆరోపించారు. కార్మికుల పట్ల ఎప్పుడైనా అనుకూలంగా మాట్లాడారా వాళ్ళు.. లక్ష రెండు వేల కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు ఇచ్చాడు.. కానీ కట్టిన ముడేళ్లకే కూలి పోయింది అని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికి లక్ష రెండు వేల కోట్లు అప్పు తెచ్చిన.. వడ్డీలు కట్టడానికే సరిపోతుంది.. ఏ పథకం అయినా ఆగిందా?.. అని ముఖ్యమంత్రి రేవంత్ ప్రశ్నించారు.

Read Also: Rakul : ఆస్తులన్ని తాకట్టు పెట్టిన ఫలితం లేకుండా పోయింది.. అంటున్న ర‌కుల్ భ‌ర్త

ఇక, ఖజానా అంతా లూటీ చేసినా ఏ పథకం ఆగలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేద ప్రజల ఇండ్లో సన్న బియ్యం ఇస్తున్నాం.. గుజరాత్ లో కూడా ఏడాదిలో 58 వేల ఉద్యోగాలు ఇచ్చారా?.. నేను ఇచ్చిన.. మనం దివాలా తీశాం.. కేసీఆర్ కుటుంబం మాత్రం కోట్లు వెనకేసుకున్నారు అని ఆరోపించారు. గతంలో మీ ఫోన్ లు స్వేచ్ఛగా మాట్లాడుకున్నారా.. ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు.. స్వేచ్ఛ, సంక్షేమం ఇచ్చినం మేమని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆర్టీసీ కార్మికులు పంథానికి పోకండని సూచించారు. మిమ్మల్ని ఆదుకుంటాం.. మీ సమస్యలు మంత్రితో మాట్లాడండి.. లేదంటే నా దగ్గర ఉన్న ఖజానా మీకు ఇస్తా.. మీరే చూసి చెప్పండి అన్నారు. బడ్జెట్ పద్మనాభం లాగా తయారైంది నా పరిస్థితి అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Exit mobile version