NTV Telugu Site icon

Eatala Rajendar: లగచర్ల రైతులు తమ భూములు ఇవ్వమంటున్నా భయపెడుతున్నారు

Etala

Etala

Eatala Rajendar: లగచర్ల రైతులు తమ భూములు ఇవ్వమంటున్నా భయపెడుతున్నారు అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. అనేక సంవత్సరాలుగా అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తున్నారు.. లగచర్ల ప్రజలపై దాడులు చేశారు.. యుద్ధ భూమిగా రేవంత్ రెడ్డి చేశారు అని భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆరోపించారు. ఇక మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.. కానీ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిని మాత్రం 50 వాహనాల కాన్వాయ్ తో పంపించారు అని ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు.

Read Also: Hoax Bomb Threat: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..

అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడిని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బయటకు వచ్చి లోపలికి తీసుకెళ్లారు.. కానీ, బీజేపీ ఎంపీ డీకే అరుణకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదు అని మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఆరోపించారు. అలాగే, ముచ్చర్లలో 14 వేల ఎకరాల భూమిని బలవంతంగా సేకరించారు.. ఆ భూముల్ని ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ గా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది అని తెలిపారు. రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయని ఈటెల రాజేందర్ మండిపడ్డారు.

Show comments