NTV Telugu Site icon

Panthangi Toll Plaza: దసరా ఎఫెక్ట్‌.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌..

Panthangi Toll Plaza

Panthangi Toll Plaza

Panthangi Toll Plaza: తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి ప్రధాన పండుగలు. ఈ రెండు పండుగలకు అందరూ తమ ఇళ్లకు చేరుకోవాల్సిందే. కొంతమంది ఇంటికి వెళ్లేందుకు రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుంటే, మరికొందరు కార్లు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. ఇక దసరా రానే వచ్చింది. దీంతో స్కూల్స్‌, కాలేజీలకు దసరా పండుగ సందర్భంగా 12 రోజులు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. రేపే దసరా పండుగ కావడంతో హైదరాబాద్-వరంగల్ రహదారిపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది.

కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. టోల్ ప్లాజా అధికారులు టోల్ గేట్‌ల సంఖ్యను ఆరు నుండి ఎనిమిదికి పెంచినప్పటికీ వాహనాలు రద్దీ పెరుగుతూ వస్తుంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులకు, టోల్‌ ప్లాజా సిబ్బందికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరోవైపు దసరా కోసం గ్రామీణ మార్గంలో వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వెళ్లే రైళ్లు, బస్సులు కూడా బారులు తీరారు. నల్గొండ, సూర్యాపేట, దేవరకొండ, కోదాడ, హుజూర్‌నగర్‌లలో టిఎస్‌ఆర్‌టిసి బస్సులు తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో నిండిపోయాయి. వాహనాలు వేల సంఖ్యలో వస్తుండటంతో అధికారులు ట్రాఫిక్ చర్యలు చేపట్టారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?