NTV Telugu Site icon

CM Revanth Reddy: ఇవాళ్టి నుంచి కుటుంబ డిజిటల్​ కార్డులు.. ప్రారంభించనున్న సీఎం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: నేటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు అన్ని సంక్షేమ పథకాలను ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారానే అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా నేటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో ఇంటింటికీ తనిఖీలు చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. నియోజక వర్గంలో పూర్తిగా రూరల్‌గా ఉన్న రెండు గ్రామాల్లో, పూర్తిగా పట్టణ, నగర పరిధిలోని రెండు వార్డులు లేదా డివిజన్‌లలో పైలట్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు.

Read also: Dasara Navaratri Utsavalu 2024: ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

అధికారుల బృందాలు క్షేత్రస్థాయి విచారణలో కుటుంబాలను నిర్ధారిస్తాయి, కొత్త సభ్యులను చేర్చుకుంటాయి మరియు చనిపోయిన వారి పేర్లను తొలగిస్తాయి. కుటుంబ పెద్ద మహిళను యజమానిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలు కార్డు వెనుక భాగంలో ప్రచురించబడతాయి. కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే కుటుంబ ఫోటో తీయాలని, ఐచ్ఛికంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. రోజుకు 30-40 ఇళ్లు సర్వే లక్ష్యంగా.. పైలట్ ప్రాజెక్టును నియోజకవర్గ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓ, పట్టణ, నగర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. ఐదు రోజుల పైలట్ ప్రాజెక్టులో ఎదురవుతున్న సానుకూలతలు, ఇబ్బందులను సమీక్షించి మార్పులు చేర్పులు చేయాలని, కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
PM Internship Scheme: ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పథకం నేటి నుంచి ప్రారంభం.. దరఖాస్తుతో ఈ ప్రయోజనాలు

Show comments