NTV Telugu Site icon

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో వివిధ శాఖల పద్దులపై చర్చ..

Assembly

Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు (మార్చ్ 26) శాసన సభలో బడ్జెట్ పద్దులపై నాలుగో రోజు చర్చ కొనసాగనుంది. అసెంబ్లీలో వివిధ శాఖల పద్ధులపై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి- గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, హోమ్ అడ్మినిస్ట్రేషన్ శాఖల పద్దులపై చర్చతో సభ మొదలు కానుంది. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క- ఫిసికల్ అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్, సర్వే అండ్ స్టాటస్టిక్స్, ఎనర్జీ శాఖ, పద్దుపై చర్చ జరగనుంది.

Read Also: AP News: రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ, రెండు ఉప సర్పంచ్‌ స్థానాలకు ఉప ఎన్నికలు..

ఇక, స్టేట్ లెజిస్లేచర్ శాఖ పద్దులపై మంత్రి శ్రీధర్ బాబు చర్చను ప్రారంభించనుండగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖల పద్దులపై చర్చ జరపనున్నారు. ఇక, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి- ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్, సివిల్ సప్లైస్ అడ్మినిస్ట్రేషన్ శాఖల పద్దులపై చర్చించనున్నారు. అలాగే, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సప్లమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ 2024- 2025 సభలో ప్రవేశ పెట్టనున్నారు.. సభలో చర్చించి సభ్యుల ఆమోదం కోరనున్నారు.