NTV Telugu Site icon

Telangana Assembly 2024: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 19 పద్దులపై చర్చ..

Telangana Assembly 2024

Telangana Assembly 2024

Telangana Assembly 2024: నేడు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. నిన్నటి సమావేశంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, అధికార పార్టీ మధ్య మాటల యుద్దం జరిగింది. ఈరోజు కూడా శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగనుంది. నిన్న 17 గంటలకు పైగా శాసనసభ సాగింది. స్కిల్ యూనివర్సిటీ బిల్లు నేడు సభ ముందుకు రానుంది. ఈ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు మండలిలో సమస్యలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో తొమ్మిది శాఖల సమస్యలపై చర్చించనున్నారు. మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమంపై నేడు చర్చ జరగనుంది. సాగునీరు, పౌర సరఫరాల సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. వ్యవసాయ శాఖ, పర్యాటక శాఖ సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. దేవాదాయ, అటవీ శాఖల సమస్యలపై శాసనసభ సభ్యులు చర్చించనున్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మాతా శిశు సంక్షేమంపై సభలో చర్చించనున్నారు.

Read also: Rythu Runa Mafi: నేడు రెండో విడత రైతు రుణమాఫీ.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిధులు జమ..

రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, ఐఅండ్ పీఆర్‌లపై సభ్యులు చర్చించనున్నారు. ఇరిగేషన్‌, సివిల్‌ సప్లయ్‌పై సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అసెంబ్లీ వేదికగా జరగనుంది. లక్షన్నర వరకు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం నేడు మాఫీ చేయనుంది. రెండో దశలో 7 లక్షల మంది రైతులకు 6100 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని నిధులను విడుదల చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ ఇచ్చిన కట్‌ మోషన్‌పై నిన్న తెలంగాణ శాసనసభలో పెద్ద దుమారమే రేగింది. బిఆర్‌ఎస్ కట్ మోషన్‌లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారు. కోత మోషన్లను చేపట్టకుండా కోతలను ఆమోదించాలని ప్రభుత్వం కోరింది. గతంలో కట్ మోషన్లను పద్దుల చేపట్టి ఆమోదించకుండానే బుల్ డోజర్లు వేశారు. తాము ప్రజాస్వామ్యవాదులమని, అన్నింటికీ సమాధానం చెబుతామన్నారు. ప్రతిపక్షాలు మాకు సహకరించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కోరారు. నిన్నటితో తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై వాడివేడి చర్చ ముగిసింది. ఆయా సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆర్థిక మంత్రి సభలో సవివరంగా వివరణ ఇచ్చారు.
Delhi Incident : ‘ఎక్కడున్నారు సార్’..అర్ధరాత్రయినా ఆగని విద్యార్థుల నిరసనలు..

Show comments