Dengue Fever: తెలంగాణ రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. నిన్నటి వరకు 5,500 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. ఇక, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు.
Read Also: Gangrape Case: తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు చెరువులో దూకి మృతి.. (వీడియో)
ఇక, డెంగ్యూ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయితే, నిలోఫర్ ఆసుపత్రి పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఆస్పత్రిలో సరిపడ బెడ్స్ లేక ఒక్కో బెడ్ పైన ఇద్దరికీ పైగా పేషంట్స్ ను ఉంచారు వైద్య సిబ్బంది. అలాగే, హస్పటల్ కు వచ్చే రోగులకు సంబంధించిన బంధువులు రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు.
