NTV Telugu Site icon

Emotional Scene: కంటతడి పెట్టించే సన్నివేశం.. తండ్రిని చూసి భావోద్వేగానికి గురైన కూతుళ్లు..

Emotinal Scene

Emotinal Scene

Emotional Scene: ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులనే కాటికి పంపుతున్న నేటి సమాజంలో.. తాజాగా ఓ ఘటన అందరిని కంటతడి పెట్టించింది. ఆరేళ్ల తర్వాత తండ్రిని అనాథ ఆశ్రమంలో చూసిన ఇద్దరు కూతుళ్లు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌ లోని మాతృదేవోభవ అనాథాశ్రమంలో జరిగింది.

Read also: Justice Sanjiv Khanna: ఢిల్లీలో వాయు కాలుష్యం.. వర్చువల్‌గా కేసుల విచారణ

హైదరాబాద్‌ లోని మాతృదేవోభవ అనాధాశ్రమంలో ఎందరో అనాథలకు అశ్రయం ఇస్తుంది. సుమారు 130 మందిని అనాధనలు ఇందులో ఉంటున్నారు. అయితే ఆరు సంత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న బాలయ్య అనే వ్యక్తిని మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు. అప్పటి నుంచి బాలయ్య అక్కడే ఉంటున్నాడు. అయితే గతనెల మాతృదేవోభవ అనాధాశ్రమానికి వచ్చి తన తండ్రి తప్పిపోయాడని, మతి స్థిమితం లేదని, తండ్రికోసం గాలిస్తున్నట్లు బాలయ్య కూతురు దివ్వ తెలిపింది.

Read also: Domestic Airlines : ఒక్క రోజులో 5 లక్షల మంది ప్రయాణం.. పెళ్లిళ్ల సీజన్‌లో రికార్డు క్రియేట్ చేసిన ఎయిర్‌లైన్స్

అయితే తాజాగా బాలయ్య కూతుర్లు ఇద్దరు మాతృదేవోభవ అనాధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. మతిస్థిమితం కోల్పోయి ఆరేళ్లుగా అక్కడే ఉంటున్న తండ్రిని చూసి కూతుళ్లు గుర్తుపట్టారు. 130 మందిలో తండ్రిని చూసిన ఇద్దరు కూతుళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నాన్న అంటూ దగ్గరకు వెళ్ళారు. అయితే బాలయ్య వాళ్లను చూసి భయాందోళన చెందాడు. ఆశ్రమంలో ఉన్న వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు.. వీళ్లు నీ కూతుళ్లే అనడంతో.. కాసేపు కూతుళ్లు, మనవళ్లతో బాలయ్య ఆనందంగా గడిపాడు. బాలయ్యను ఇంటికి తీసుకుని వెళతామని చెప్పడంతో ఆశ్రమ నిర్వాహకులు పలు కండిషన్స్‌ పెట్టి బాలయ్యను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన చూసి వారందరూ.. ఇలాంటి కూతుళ్లు ఉంటే చాలు ఆ తండ్రి జీవితం ధన్యమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Filpkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఈ సూపర్ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌పై 9 వేల తగ్గింపు!