CPI Narayana: సినీ ప్రముఖులతో సీఎం సమావేశం.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..
- ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా చూడాలి..
- సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..,
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: ఇవాళ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా చూడాలని అన్నారు. టికెట్ల ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్ ప్రోత్సహించినట్టు లెక్క అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వహించేలా చర్చలు ఉండాలన్నారు. సినిమా వాళ్ళు వేల కోట్లు ఖర్చు పెట్టీ సినిమాలు తీస్తున్నారన్నారు. ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి, సినిమా టిక్కెట్లు రేట్లు పెంచుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెయ్యి కోట్లు ఖర్చు చేసి…రెండు వేల కోట్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎందుకు టికెట్ల రేట్లు పెంచి ప్రోత్సహించాలి? అని ప్రశ్నించారు. సందేశాత్మక చిత్రాలు ఐతే ప్రోత్సాహకాలు ఇవ్వాలి… కానీ క్రైమ్, అశ్లీలత పెంచే సినిమాలకు బెనిఫిట్ ఎందుకు చేయాలి? అని సీపీఐ నారయణ ప్రశ్నించారు.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
సినిమా హీరోలు రోడ్ షోలు ఎందుకు చేయడం? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో షో చేస్తున్నప్పుడు… జనం వెంట పడటం సహజం అన్నారు. ప్రభుత్వాలు కూడా 100 రూపాయల టికెట్ వెయ్యి రూపాయలు చేయడం ఎందుకు ? అని నారాయణ ప్రశ్నించారు. పుష్ప సినిమాలో ఏముంది..? ఒక ఎర్రచందనం దొంగ నీ హీరోగా చూపించి… దాన్ని యువత మీద రుద్దుతున్నారని మండిపడ్డారు. హిరోయిన్ రష్మిక… ఫీలింగ్స్ పాటకు డాన్స్ చేయడం ఇష్టం లేదు.. కానీ డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చింది అని చెప్పిందని గుర్తు చేశారు. అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాభిమానం చంపుకుని పని చేస్తున్నారని మండిపడ్డారు. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి రూ.2 కోట్లు కాదు ఐదు కోట్లు ఇచ్చిన ప్రాణాలు తెచ్చి ఇవ్వలేరన్నారు.
CM Revanth Reddy: నేడు సినీ ప్రముఖులతో సీఎం భేటీ.. 36 మంది సభ్యులతో సమావేశం..
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!