NTV Telugu Site icon

CPI MLA Kunamneni: బడ్జెట్కి డబ్బులు లేవు.. వాగ్దానాలు విపరీతంగా చేశారు.. వాటిని నెరవేర్చడానికి తిప్పలు

Kunamneni

Kunamneni

CPI MLA Kunamneni: తెలగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి చాలా బాగా నిర్వహించారు అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాలకు నేను లేకపోయినా.. నాకు చాలా మంది ప్రజాప్రతినిధులు చెప్పారు.. అసలు మాట్లాడించేవారు కాదని.. ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే మార్షల్స్ కి పని చెప్పే వారని విన్నాను.. ఇక, బడ్జెట్ లో సామాన్యులకు ఏ ప్రభుత్వం న్యాయం చెయ్యడం లేదు.. అప్పులు ఎక్కువగా ఉన్నాయి.. హామీలు ఎక్కువగా ఉన్నాయి.. బడ్జెట్ కి డబ్బులు లేవు.. వాగ్దానాలు విపరీతంగా చేశారు.. వాటిని నెరవేర్చడానికి తిప్పలు పడుతున్నారు అని ప్రభుత్వంపై సెటైర్లు వేశారు ఆయన. అయితే, హామీలను నెరవేర్చడం కోసం ప్రిపేర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది.. రుణమాఫీలో టెక్నికల్ కారణాల వల్ల చాలా మందికి రాలేదు.. జిల్లాల్లో కొన్ని ఏరియాలో చాలా తక్కువ మందికి రుణమాఫీ జరగలేదు.. పెన్షన్, మహిళలకు 2500, ఆడ పిల్లలకు తులం బంగారం, ఇవన్నీ నెరవేర్చాలి.. బడ్జెట్ పెట్టిన దాంట్లో పూర్తి స్థాయిలో ఖర్చు చేసి అన్ని అమలు చేసేవిధంగా చూడాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

Read Also: Telangana Govt: రిటైర్డ్ ఉద్యోగులపై తెలంగాణ సర్కార్ వేటు.. 6,729 మంది తొలగింపుకి ఆదేశాలు!

అయితే, పెట్టిన ప్రతి రూపాయినీ ఖర్చు పెట్టాలి అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. కొన్ని పద్దుల చుట్టూ మాత్రమే తిరుగుతున్నారు.. దాదాపుగా రెండు కోట్ల మందికి కనీస వేతనం అందించాల్సి ఉంటుంది.. అంగన్వాడీలు, ఆశా వర్కర్ల, సింగరేణి, ఆర్టీసీ, వ్యవసాయ కూలీలు, పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, లేబర్ డిపార్ట్మెంట్ లో పని చేసే వారు.. ఇలా ప్రతి ఒక్క విభాగంలో పని చేసే వారికి కనీస వేతనం ఉండేలా చూడాలన్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులపై పోరాడాల్సిందే.. అందరం కలిసి పోరాటం చేద్దాం.. అసలు అంశాలు చర్చకు రాకుండా తిట్టుకోవడం ఏంటి? అని ప్రశ్నించారు. అప్పులు చేశావు కాబట్టి నీదే బాధ్యత అంటే కుదరదు.. వాళ్ళ టైమ్ అయిపోయింది..ఇక మీరు ఏం చేస్తున్నారు.. దానిమీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. గతంలో కూడా చంద్రబాబు టూరిజంపై ప్రాధాన్యత ఇచ్చారు.. ఇప్పుడు ప్రభుత్వం టూరిజం పైనా దృష్టి పెట్టాలి.. ప్రాధాన్యత ఇవ్వండి అన్నాను.. కావాలని నా వాఖ్యలను వక్రీకరించారు.. అది మంచిది కాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.