Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్ లో పంది కొవ్వుతో వంట నూనె తయారు..

Pork Fat

Pork Fat

హైదరాబాదీలకు ముఖ్య గమనిక.. నాణ్యత లేని ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల నగరంలో కల్తీ అల్లంవెల్లుల్లీ పేస్ట్, ఐస్ క్రీమ్స్, సాస్, చాక్లెట్స్ బాగోతం బయటపడింది. అయితే, తాజాగా పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోన్న కేటుగాడ్ని మాల్కాజగిరి పోలీసులు నిన్న (బుధవారం) అరెస్ట్ చేసినట్లు మల్కాజగిరి ఇన్‌స్పెక్టర్‌ రాములు వెల్లడించారు.

Read Also: Realtor Family kidnap: విశాఖలో కలకలం.. రియాల్టర్ ఫ్యామిలీ కిడ్నాప్

హైదరాబాద్‌ లోని నేరేడ్‌మెట్‌ పరిధిలోని ఆర్కేపురంలో రమేశ్‌ శివ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే.. గుట్టు చప్పుడు కాకుండా రమేశ్‌ తన ఇంట్లోనే గత కొన్నేళ్లుగా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నాడు. తొలుత పంది మాంసం విక్రయించే వారి నుంచి కొవ్వు తెచ్చుకునే వాడు.. ఆ తర్వాత దాన్ని వేడి చేసి పలు రకాల కెమికల్స్ కలిపితే అచ్చం వంట నూనెలాగా కనిపించే ఫుడ్ ఆయిల్స్ ను తయారు చేశాడు. ఇలా తయారు చేసిన నూనెను రోడ్డు పక్కన ఉండే ఫ్రైడ్‌ రైస్‌ దుకాణాల నిర్వాహకులకు తక్కువ రేట్ ను విక్రయించాడు అని పోలీసులు తెలిపారు.

Read Also: Share Market: 2024 నాటికి సెన్సెక్స్ 80,000 దాటుతుంది.. ఇది మోడీ మాయేనా ?

దీంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిన్న (బుధవారం) రమేశ్‌ ఇంటిపై ఆకస్మిక సోదాలు నిర్వహించారు. దీంతో గుట్టుగా పంది కొవ్వుతో నూనె తయారు చేస్తున్న నిందితుడి బండారం మొత్తం బట్టబయలైంది. నిందితుడిని నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. పంది కొవ్వు నూనెను కొనుగోలు చేస్తున్న ఫాస్ట్‌ ఫుడ్‌ దుకాణదారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.

Exit mobile version