NTV Telugu Site icon

Congress vs BRS: సభలో చెప్పు చూపించారన్న బీఆర్ఎస్.. కాదన్న కాంగ్రెస్

Telangana Assembly

Telangana Assembly

Congress vs BRS: అసెంబ్లీ ప్రారంభం కాగానే ఫార్మలా ఈ కార్‌ రేస్‌ అంశంపై కాంగ్రెస్‌ మాట్లాడాలని బీఆర్ఎస్‌ పట్టుబడింది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ భారతి బిల్లుపై చర్చను ప్రారంభించారు. అయితే ఫార్ములా రేసుపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. దీంతో మంత్రి వెనుక కూర్చున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలోంచి లేచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై పేపర్లు విసిరారు. కాగా, శంకరయ్య విపక్ష సభ్యులకు చెప్పులు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్పీకర్‌ వద్దకు వెళ్లిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పేపర్లను విసిరేశారు. దీంతో అటు బీఆర్ఎస్‌, ఇటు కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. గందరగోళ పరిస్థితిల్లో సభను 15నిమిషాలు వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్‌.

Read also: Telangana Assembly Live 2024: 6వ రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు..

చెప్పు చూపించలేదు – కాంగ్రెస్

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై మొదట షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ చెప్పు చూపించాడని ఆ తర్వాతే మేము పేపర్ లు విసిరామని బీఆర్ఎస్‌ ఎమ్మల్యేలు మాటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ స్పందిచారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. దళితుడైన స్పీకర్ పై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు పేపర్లు విసిరి అవమానించారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు చేసిన పనికి నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. కేటీఆర్ పై కేసు అవ్వడంతో జైలుకు వెళ్తాడేమో అని ఈ దుచ్చర్య్యకు పాల్పడ్డారని అన్నారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే లపై మొదట షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ చెప్పు చూపించాడని చెప్పడం అవాస్తవమని తెలిపారు. మరోవైపు సభలో జరిగిన ఘటన దురదృష్టకరం మని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీనియర్ సభ్యులు… మీ మీదకు వచ్చి .. సభ్యుల ప్రవర్తన గుండాగిరి సరికాదన్నారు. రౌడీయిజం సరికాదని, దీన్ని కట్టడి చేయాలని తెలిపారు.

Read also: Zebra : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన జీబ్రా.. ఎక్కడంటే..?

చెప్పు చూపించారు- బీఆర్ఎస్

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..సభలో మాకు చెప్పు చూపించారని అన్నారు. మేము మాట్లాడితే తాగి వచ్చామని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వ డాక్టర్ ను పిలిపించి ఆల్కహాల్ పరీక్ష చేయించాలన్నారు. మేమందరం టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆరు గ్యారంటీల పై మేము ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే.. మా సీనియర్ ఎమ్మెల్యే కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాన సమస్య ఈ కార్ రేసు పై చర్చ పెట్టాలని అంటున్నామన్నారు. శాసన సభలో జరిగిన ఘటనల పుటేజ్ ని బయట పెట్టాలన్నారు. మా సభ్యులు తాగి వచ్చారని అంటున్నారని, మీరు మిమ్మల్ని టెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్ పై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని తలసాని తెలిపారు.
Alzheimer: ఆ పనులు చేసేవారికి అల్జీమర్స్ బారినపడే అవకాశం తక్కువట!

Show comments