Congress BC Leaders: రేపు ఉదయం 10:30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కలవనున్నారు. ఏప్రిల్ 8వ తేదీన బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభలో చేసిన బిల్లుకు ఆమోదం తెలపడంతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకి కాంగ్రెస్ బీసీ నేతలు ధన్యవాదాలు తెలపనున్నారు.
Read Also: Nani : ‘హిట్3’ వైబ్ అదిరిపోయింది.. మీ సపోర్ట్ వలనే ఇది సాధ్యమైంది
అయితే, రేపు (మే 2న) ఉదయం రాజ్ భవన్ తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, కేశవరావు ,మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, దండే విఠల్, విజయశాంతి, నారాయణ, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వాకటి శ్రీహరి, మక్కన సింగ్ రాజ్ ఠాకూర్, ఈర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.
