Pawan Kalyan: ఒక్క పోస్టు కూడా లేకుండానే పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ రికార్డు.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan’s instagram account followers: తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చిరంజీవి తమ్ముడిగా ఆయన తెలుగు ప్రేక్షకులను పరిచయం అయినా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. ఇక ఇప్పుడు జనసేన పార్టీ కూడా స్థాపించి ఆయన ప్రజా సేవకు సిద్దమయ్యారు. అయితే నిన్నటి వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్ లో మాత్రమే యాక్టివ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉదయం ఆయన ఖాతా తెరిచిన కాసేపటికే వెరిఫై కూడా అవడంతో ఖాతాను ప్రారంభించిన గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్ దాటేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ సింగిల్ పోస్ట్ కూడా అందులో పోస్ట్ చేయకుండానే ఆయనకు ఫాలోవర్స్ పెరిగిపోయారు, పెరిగిపోతూనే ఉన్నారు. అలా ఒక్క పోస్ట్ కూడా లేకుండా ఆయన 6 గంటల్లో 1 మిలియన్ ఫాలోయర్స్ కౌంట్ దాటేశాడు.
Double Ismart: పూరీ-రామ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. ఆరోజు నుంచే రెగ్యులర్ షూట్?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఆ లెక్కన ఒక్క పోస్ట్ కూడా లేకుండా 1 మిలియన్ ఫాలోయర్స్ ని దక్కించుకున్న ఏకైక ఇండియన్ సెలబ్రిటీ గా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాడని అభిమానులు సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తున్నారు. అయితే నిజానికి తలపతి విజయ్ ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ సమయంలో ఒక రికార్డ్ సెట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఖాతా తెరవగా కేవలం 99 నిమిషాల్లోనే 1 మిలియన్ ఫాలోవర్లను సాధించాడు. ఇక BTS V (53 నిమిషాలు), ఏంజెలీనా జోలీ (59 నిమిషాలు) తర్వాత 1 మిలియన్ ఫాలోవర్లను చాలా వేగంగా మూడవ ఫాస్టెస్ట్ ఫాలోవర్స్ సంపాదించిన అకౌంట్ గా నిలిచింది. అయితే ఆరోజున విజయ్ ఒక ఫోటో పోస్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఎలాంటి పోస్టు చేయకుండానే మిలియన్ ఫాలోవర్స్ ను సాధించారు. ఇక 24 గంటల్లో పవన్ కూ ఏ రేంజ్ ఫాలోవర్స్ రాబోతున్నారో చూడాలి.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!