NTV Telugu Site icon

CMRF Applications: జులై 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులు.. ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరణ..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CMRF Applications: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించాలని నిర్ణయించారు. సీఎంఆర్‌ఎఫ్‌ అమలును పారదర్శకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ నిధుల మళ్లింపు నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంఆర్‌ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలను తీసుకుని వారి సిఫార్సు లేఖను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తులో సంబంధిత దరఖాస్తుదారు బ్యాంకు ఖాతా నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేశారు.

Read also: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు..

అప్లికేషన్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత CMRFకి సంబంధించిన కోడ్ ఇవ్వబడుతుంది. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. నిర్ధారణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధిత ఆసుపత్రులకు పంపబడుతుంది. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, CMRF దరఖాస్తు ఆమోదించి అబ్దిదారునికి చెక్కు సిద్ధం అందచేయబడతుంది. దరఖాస్తుదారు ఖాతా సంఖ్య చెక్కుపై ముద్రించబడుతుంది. దీంతో చెక్ పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు స్వయంగా దరఖాస్తుదారులకు చెక్కులను అందజేస్తారు. ఈ నెల 15 తర్వాత ఆన్‌లైన్..దరఖాస్తుదారుల ద్వారా మాత్రమే సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వ అధికారులు https//cmrf.telangana.gov.in\ సైట్ ద్వారా తమ దరఖాస్తును పూర్తి చేయాలని సూచించారు.
MLC Kavitha: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌..