CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఉన్నతాధికారులు బదిలీ అయిన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా పాలన, వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, వనమహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై చర్చ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.
Read also: Donald Trump: రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్.. వైస్ ప్రెసిడెంట్..?
నిన్న పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో… రిజర్వేషన్లపై ఒక అవగాహన కోసం సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రెజర్వేషన్ల పెంపుపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను వెల్లడించాలని సీఎం అధికారులకు సూచించారు. గత పంచాయతీ ఎన్నికల అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే కుల గణనకు ఆమోదం తెలిపినందున, దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం తీసుకుంటారని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్..