NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్న సీఎం..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సెక్రటేరియట్‌లో మొబైల్ యాప్‌ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ లో ప్రజాపాలన – విజయోత్సవాల్లో రవాణా శాఖ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మాదాపూర్ లో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొననున్నారు.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను సేకరించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది ప్రజాపాలన ఉత్సవంలో భాగంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను సీఎం ఆవిష్కరించిన తర్వాత రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది.

Read also: Astrology: డిసెంబర్ 05, గురువారం దినఫలాలు

ఈ యాప్‌లో దరఖాస్తుదారు పేరు, ఆధార్ నంబర్, ఆ వ్యక్తికి సొంత భూమి ఉందా? లాంటి 30-35 ప్రశ్నలు ఉంటాయి. అతని ఆదాయం ఎంత? గతంలో ఏదైనా గృహనిర్మాణ పథకం ద్వారా లబ్ధి పొందారా? అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. వీటి ఆధారంగా దరఖాస్తుదారులు ఈ పథకానికి అర్హులా? కాదా? అనేది తేలుతుంది.

Read also: Pushpa The Rule Review: పుష్ప 2 రివ్యూ

* మొదటి దశలో సొంత భూమి ఉన్న పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుంది. ఈ దశలో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను అందించాలని నిర్ణయించారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. వికలాంగులు, వ్యవసాయ కూలీలు, పారిశుధ్య కార్మికులు, గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

* రెండో దశలో ఇల్లు లేని వారికి అవకాశాలు కల్పించనున్నారు. కాగా.. గత నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సమగ్ర ఇంటింటి సర్వే కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే..