Site icon NTV Telugu

PJR Flyover: హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి రానున్న మరో ఫ్లై ఓవర్..

Rr

Rr

PJR Flyover: హైదరాబాద్ లో ట్రాఫిక్‌ సమస్య తీరడంతో పాటు సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్‌ నేటి (జూన్ 28) నుంచి అందుబాటులోకి రానుంది. పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే మాదాపూర్‌ ప్రాంతం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుతో పాటు ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం ఈజీ అవుతుంది. ట్రాఫిక్‌ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఉంది.

Read Also: Shefali Jariwala: ‘కాంటా లగా’ ఫేమ్‌ షఫాలీ జరివాలా మృతి!

అయితే, ప్రారంభానికి సిద్ధమైన కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన శిల్పా లే అవుట్ ఫేజ్ 2 ఫ్లై ఓవర్ ఇది. ఇకపై ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అయితే, 182.75 కోట్ల రూపాయల ఖర్చుతో 6 లైన్ల ఫ్లైఓవర్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. రెండు ఫ్లైఓవర్ల మీదుగా మూడో లెవెల్ ఫ్లై ఓవర్ ను అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లైఓవర్ కు దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పీజేఆర్ పేరుతో నామకరణం చేశారు.

Exit mobile version