NTV Telugu Site icon

CM Revanth Reddy: జగన్నాథ రథయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

Cm Revanth Jagannath Ayatra

Cm Revanth Jagannath Ayatra

CM Revanth Reddy: ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో జగన్నాధ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు రథయాత్ర కొనసాగనుంది. జగన్నాథునికి ప్రత్యేక పూజలు చేసి ముఖ్యమంత్రి రథయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రథయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జగన్నాధ రథయాత్ర నిర్వహణలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు కూడా మంచి అనుభూతిని కలిగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read also: Bandi Sanjay: తెలంగాణలో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు…

హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహక మండలి సభ్యుడు వేదాంత చైతన్యదాస్ తెలిపారు. ఉదయం ఎన్టీఆర్ స్టేడియం నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వివిధ రాష్ట్రాలకు చెందిన ఇస్కాన్ ప్రతినిధులు ప్రారంభోత్సవ వేడుకలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నారాయణగూడ, హిమాయత్ నగర్, టీటీడీ టెంపుల్, బషీర్ బాగ్, అబిడ్స్, ఎంజే మార్కెట్ కూడలి మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు యాత్ర సాగుతుందని వివరించారు. అక్కడే పండుగ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేడుకల్లో సంగీత కచేరీలు, మహా హారతి, ప్రవచనాలు ఉంటాయన్నారు. భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు 108 ఆలయాల్లో భగవధానం చేయనున్నట్లు వెల్లడించారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉత్సవాలకు లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

CM Chandrababu Naidu: ఆంధ్రపదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు..

Show comments