NTV Telugu Site icon

CM Viral Tweet: ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి.. సీఎం ట్వీట్‌ వైరల్‌..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Viral Tweet: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనకు ఏడాది పూర్తైన సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌ ఖాతాలో ఆశక్తికర పోస్ట్‌ చేశారు. ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి… సమస్త ప్రజల ఆకాంక్షలు… సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి అని సీఎం తెలిపారు. పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను… ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను…అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి… డిసెంబర్ 7, 2023 నాడు…తెలంగాణ నా చేతుల్లో పెట్టిందని తెలిపారు. తన వారసత్వాన్ని సగర్వంగా… సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Read also: Viral Video: ఇదేక్కడి మాస్‌ రా మావా? పడుకుని కాళ్లతో స్టీరింగ్‌ని కంట్రోల్‌ చేస్తున్న లారీ డ్రైవర్(వీడియో)

ఆక్షణం నుండి… జన సేవకుడిగా… ప్రజా సంక్షేమ శ్రామికుడిగా… మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో… సకల జనహితమే పరమావధిగా… జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా… సహచరుల సహకారంతో… జనహితుల ప్రోత్సాహంతో…విమర్శలను సహిస్తూ… విద్వేషాలను ఎదురిస్తూ…స్వేచ్ఛకు రెక్కలు తొడిగి… ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి…అవనిపై అగ్ర భాగాన …తెలంగాణను నిలిపేందుకు…గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ…నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ…నిరంతరం జ్వలించే …ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా… విరామం ఎరుగక… విశ్రాంతి కోరక…ముందుకు సాగిపోతున్నానని సీఎం తెలిపారు.
Ministers Tummala: అలా చేయడం వల్లనే మున్నేరు వరద ముంపు గండం..

Show comments