Harish Vs Revanth: సభను తప్పుదోవ పట్టించిప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నామన్నారు. పూర్తి సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. బడ్జెట్ పై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులకు ఎక్కువ సమయం ఇచ్చామన్నారు. అసత్యాలను రికార్డుల నుంచి తొలగించాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, విద్యుత్ సంస్థలు మూడు పార్టీలు కలపి 2017లో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. మీటర్లు పెడతాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు. గృహాలకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ఓప్పందంలో బీఆర్ఎస్ స్పష్టంగా పేర్కొందన్నారు. విద్యుత్ ఒప్పందాలపై హరీష్ రావు వాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. హరీష్ రావుకు ఆఫ్ నాలెడ్జ్.. పెద్దాయనకు ఫుల్లు నాలెడ్జ్.. ఇలాంటి వారికి మేం ఏం చెప్తాన్నారు. గతంలో బతుకున్న చీరలు ఇస్తే.. మహిళలు తగలబెట్టిన పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో బతుకుతారన్నారు.
Read also: Tihar Jail: తీహార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరికి గాయాలు..!
బతుకమ్మ చీరల విషయంలో అవినీతి జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ ఆలోచన మారలేదు.. విధానం మారలేదన్నారు. బీఆర్‌ఎస్ తీరు వల్ల కేంద్ర బడ్జెట్‌లో నిధులు రాలేదన్నారు. గొర్రెల పథకంలో 700 కోట్ల స్వాహా చేశారని తెలిపారు.వేల కోట్ల విలువైన భూములు అమ్మేశారని అన్నారు. పాలమూరు జిల్లా కేసీఆర్‌కు ఏం అన్యాయం చేసింది? అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి బీఆర్‌ఎస్ దుర్మార్గ కారణం కాదా? అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను సభ్యపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా, కొడంగల్‌కు గోదావరి నీరు ఇవ్వొద్దని కుట్ర చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారీ అవినీతి జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా ఇచ్చినా వారి బుద్ధి మారలేదన్నారు. చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. రంగారెడ్డి జిల్లా ఆస్తులను భూములను అమ్ముకున్నది గత ప్రభుత్వం అన్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌లో ప్రజలు బొంద పెట్టారని మండిపడ్డారు. బతుకమ్మ చీరలు, కెసిఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ పై విచారణకు సిద్ధమా? విచారణకు సిద్ధమైతే సవాళ్లు బీఆర్ఎస్ స్వీకరించాలి? అని సవాల్ విసిరారు.
Telangana Assembly 2024 LIVE UPDATES: తెలంగాణ అసెంబ్లీ 2024.. లైవ్ అప్‌డేట్స్
