NTV Telugu Site icon

CM Revanth Reddy: పెద్ద అంబర్‌పేటలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించిన సీఎం

Cm Revanht Reddy

Cm Revanht Reddy

CM Revanth Reddy: రాష్ట్ర సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. విగ్రహానికి తుది మెరుగులు దిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహం తయారీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. తాజాగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అంబర్‌పేటకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. విగ్రహ తయారీ పనులపై శిల్పిని సీఎం అడిగి తెలుసుకున్నారు.

విగ్రహం తుది మెరుగులపై ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, డిసెంబరు 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, సోనియా గాంధీ జన్మదినం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు డిసెంబర్ 9వ తేదీ. అయితే.. అటు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు, ఇటు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన రెండూ ఒకే రోజు కావడంతో ఘనంగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Ponnam Prabhakar: త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు..

Show comments