NTV Telugu Site icon

CLP Meeting: నేడు సీఎల్పీ సమావేశం.. రేపు అభిషేక్‌ సింఘ్వీ నామినేషన్..

Clp Meeting

Clp Meeting

CLP Meeting: నేడు కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. నానక్ రామ్‌గూడలోని హోటల్ షెరటన్‌లో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆహ్వానించారు. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని పరిచయ కార్యక్రమంతోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. సీఎల్పీ సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని సింఘ్వీ పార్టీ ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కోరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

Read also: Kaleshwaram Project: నేటి నుంచి జస్టిస్‌ పీసీ ఘోష్‌ విచారణ..

తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె.కేశరావు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ఇటీవల హైకమాండ్ ధృవీకరించింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్ ను గెలిపించడమే సీఎల్ ఎఫ్ సమావేశంలో ప్రధాన ఎజెండా. దీంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాలపై చర్చిస్తారని తెలిసింది. అలాగే, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వీ భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వచ్చిన సింఘ్వీ.. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రేవంత్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, నాగర్​కర్నూల్​ ఎంపీ మల్లు రవి ఉన్నారు.
Kolkata Doctor Case: ఆందోళనకు ఐఎంఏ పిలుపు.. ఇందిరాపార్కులోని ధర్నాచౌక్‌ వద్ద ధర్నా..

Show comments