NTV Telugu Site icon

Shivaji Maharaj Jayanti: తెలుగు నేలపై నడయాడిన ఛత్రపతి శివాజీ..

Chatrapathi

Chatrapathi

Shivaji Maharaj Jayanti: మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి, ధర్మ స్థాపన కోసం సామ్రాజ్యం స్థాపించిన గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ 395వ జయంతి నేడు. అయితే, ఛత్రపతి శివాజీ తెలుగు నేలపై నడయాడినట్లు తెలుస్తుంది. అయితే, పుణె, తుల్జాపూర్‌, పండరీపూర్‌ మీదుగా 1677 ఫిబ్రవరి నెలలో నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో లోకాయపల్లి రాణి లక్షమ్మ సంస్థానానికి వచ్చినట్లు సమాచారం. జైత్రయాత్ర పేరుతో వచ్చిన శివాజీ సైన్యంలోని కొందరిని ఇక్కడే వదిలి పెట్టి.. మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మీదుగా గొల్కొండకు వెళ్లారంటున్నారు. ఇక, శివాజీ వెంట సుశిక్షితులైన 50 వేల మందితో కూడిన సైన్యం ఉండేది అని పేర్కొన్నారు. శివాజీ రాకకు గుర్తుగా హైదరాబాద్‌లోని పురానాపూల్‌ దగ్గర పెద్ద స్మారకాన్ని సైతం నిర్మించారు. అప్పట్లో మహామంత్రి మాదన్న నారాయణపేట ప్రాంతానికి వచ్చి శివాజీని స్వాగతిస్తూ ఆలింగనం చేసుకున్నారని అక్కడ నానూడి. శివాజీ నడుస్తుండగా ప్రజలు పూలవర్షం కురిపించారు. నెల రోజుల పాటు తెలంగాణలోనే ఉండి అనంతరం శ్రీశైలానికి ఆయన తిరిగి వెళ్లిపోయాడని లోకాయపల్లి సంస్థాన చరిత్రలో పేర్కొన్నారు.

Read Also: Assam Congress: అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా గౌరవ్ గొగోయ్‌..

ఇక, పద్మశాలి, కుర్ని, స్వకుల్‌ శాలి, జాండ్ర కులస్తులు గతంలో ఛత్రపతి శివాజీ సైన్యంలో కీలకంగా పని చేసేవారు. గద్వాల, పోచంపల్లి, బోధన్‌, కర్ణాటక, వాడి, గుల్బర్గా, షాపూర్‌ లాంటి ప్రాంతాల్లో శివాజీ జైత్రయాత్ర కొనసాగింది. అయితే, అప్పుడు సైన్యంలో పని చేసే కార్మికులు తెలంగాణ ప్రాంతంలో ఉంటూ చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి శివాజీ వెళ్లినట్లు చారిత్రక ఆధారాలు లభించాయి. చేనేత రంగానికి పునాది వేసింది ఛత్రపతి శివాజీ అని ప్రజలు నమ్ముతారు.