Site icon NTV Telugu

Chennakesavareddy: మల్లికార్జున థియేటర్ వద్ద బాలయ్య అభిమానులు రచ్చ

Chennakesavareddy Completes 20 Years

Chennakesavareddy Completes 20 Years

Chennakesavareddy movie completes 20 years: ఫ్యాక్షనిజానికి హీరోయిజమ్ అద్దిన చిత్రాలలో కథానాయకునిగా నటించి అపూర్వమైన విజయాలను సొంతం చేసుకున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఆయన నటించిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ ఆ తరహా చిత్రాలే! ఈ సినిమాల ఘనవిజయాన్ని చూసి ఇతర హీరోలు సైతం అదే పంథాలో పయనించారు. అలాంటి ఫ్యాక్షనిజమ్ నేపథ్యంలోనే బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం తెరకెక్కింది. శ్రీసాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2002 సెప్టెంబర్ 25న ‘చెన్నకేశవరెడ్డి’ విడుదలై విజయం సాధించింది.

Read also: Ghulam Nabi Azad: నేడు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న గులాం నబీ ఆజాద్!

నట సింహం నందమూరి బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. దీంతో బాలయ్య అభిమానుల్లో జోష్‌ నింపింది. బాలయ్య డైలాగులతో సినిమా థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేసారు బాలయ్య అభిమానులు. జై బాలయ్య అంటూ ఆప్రాంగణం అంతా దద్దరిల్లింది. చెన్నకేసవరెడ్డి ఎంతో అద్భుతంగా ప్రదర్శింబడుతున్న సందర్భంగా.. హైదరాబాద్‌ కూకట్ పల్లి మల్లికార్జున థియేటర్ లో అభిమానులు ఆనందానికి హద్దు్‌ల్లేవనే చెప్పాలి. నిన్న ఆదివారం సాయంత్రం 5 గంటలకు అభిమానులు కేక్ కట్‌ చేసి, క్రాకర్స్ కాల్చి, రచ్చ చేసారు. దీంతో మల్లికార్జున థియేటర్‌ వద్ద అభిమానులు సందడి అంరాన్నంటాయి.
Ghulam Nabi Azad: నేడు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న గులాం నబీ ఆజాద్!

Exit mobile version