Site icon NTV Telugu

Ex Minister Harish Rao: మాజీ మంత్రి బంధువులపై చీటింగ్‌ కేసు నమోదు..

Ex Minister Harish Rao

Ex Minister Harish Rao

Ex Minister Harish Rao: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు బంధువులపై కేసు నమోదైంది. హరీశ్‌రావు తమ్ముడు మరదలు, మేనమాలు, మరో ముగ్గురిపై మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు బాధితులు. ఫాస్మో కంపెనీపై అక్రమాస్తులు, మోసం చేశారంటూ కేసులు నమోదు చేశారు. మియాపూర్ లో దండు లచ్చిరాజు అనే వ్యక్తికి చెందిన ఐదంస్తుల ప్రాపర్టీని తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల తనకు తెలియకుండా ఇంటిని విక్రయించారని.. బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీ నోటుతో మోసం చేశారని, మియాపూర్ పీఎస్ లో లచ్చిరాజు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు అతనిపై ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, లచ్చిరాజు తన ఆస్తి కోసం 2019 నుంచి గొడవ పడుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Gutha Sukender Reddy: కేటీఆర్ తెలివిగా మాట్లాడుతున్నారు.. గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్‌

Exit mobile version