NTV Telugu Site icon

Telangana Assembly: అసెంబ్లీలో ఉద్రిక్తత.. అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం..

Assembly

Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండడు స్పీచ్.. 15 నెలల పాలననీ.. 36 నిమిషాల్లో చదివేశారు.. రైతులకు రుణమాఫీ చేశారా..? అని ప్రశ్నించారు. మహా లక్ష్మీ పథకాన్ని అమలు చేశారా?.. రైతు కూలీలకు 12 వేలు రూపాయలు ఇచ్చారు మీరు?.. అధికారం కోసం లక్షల అబద్ధాలు చెప్పారు మీరు.. తొందర పడొద్దని జగదీష్ రెడ్డి అడిగారు.

Read Also: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!

ఇక, జగదీష్ రెడ్డికి ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. మా ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయల రుణా మాఫీ చేసింది అన్నారు. పేదలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అమలులో ఉంది.. అవన్నీ ఆయనకు కలిపించడం లేదు అన్నారు. అలాగే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు మూడు ఎకరాల ఇస్తాం అన్నావు ఇచ్చావా అని ప్రశ్నించారు. దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే లేకుండా చేశారు.. డబుల్ బెడ్ రూం ఇచ్చావా.. లక్ష అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన మీరు మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. దీంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. మంత్రులు ఇలా మద్యలో అడ్డొచ్చి.. నువ్వెంత..నేను ఎంత అనుకుంటే సభ నడుస్తదా అని అడిగారు.

Read Also: Beerla Ilaiah: హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారు..

అయితే, ప్రతిపక్షాలు.. గవర్నర్ ప్రసంగం పైనే మాట్లాడండి అని శాసన సభ స్పీక్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సభ్యులు డివేయేషన్ అయితే, అటు నుంచి కూడా కౌంటర్ వస్తుంది.. అధికార పక్షం మాట్లాడకుండా ఉండాలి అంటే.. మీరు డివియేషన్ కాగండి అని సూచించారు. ఇక, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. స్పీకర్ నీ బెదిరించే మాటలు మాట్లాడకండి.. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి అని పేర్కొన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పినది విన్నాం.. 14 నెలల్లో మేము చేసిన సంక్షేమం.. మీరు పదేళ్లలో చేయలేదు.. జగదీష్ రెడ్డి అనుభవం షేర్ చేయండి కానీ.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.

Read Also: Shivaji: ఈ మంగపతి గుర్తుండిపోతాడు..!

ఇక, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసహనానికి గురికాకండి అని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇది మంచిది కాదు.. సభను తప్పుదోవ పట్టించడం సరికాదు అన్నారు. నన్ను ప్రశ్నించడమే తప్పు.. నేను ఏం తప్పుదోవ పట్టించానో చెప్పండి అని జగదీష్ రెడ్డి అడిగారు. ఈ సభలో సభ్యులందరికి పెద్దగా స్పీకర్ అక్కడ కూర్చొన్నారు తప్పా స్పీకర్ ది ఈ సభ కాదు.. జగదీష్ రెడ్డి ఏం తప్పు మాట్లాడలేదు.. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని జగదీష్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. స్పీకర్ కి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అలాగే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. జగదీష్ రెడ్డి.. స్పీకర్ ప్రసాద్ కుమార్ నీ కించపరిచేలా మాట్లాడారు.. జగదీష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు. దళితుల వర్గాలంటే బీఆర్ఎస్ పార్టీకి చిన్న చూపు అని లక్ష్మణ్ తెలిపారు. సభలో గందరగోళ పరిస్థితులతో సభ 15 నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు.