Site icon NTV Telugu

Cotton Price: రైతులకు శుభవార్త.. MSP ధరకే పత్తి కొనుగోలు

Cci

Cci

Cotton Price: తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలు సమస్యలపై సీసీఐ ఎండీ, రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశం అయ్యారు. సీసీఐ కొనుగోళ్లపై సమావేశంలో కీలక చర్చలు జరిపారు. పత్తి రైతులకు మద్దతు ధర దక్కే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Read Also: Kantara Chapter1 : ఇదేం క్రేజ్ బాబోయ్.. మూసేసిన థియేటర్స్ కూడా కాంతార కోసం తెరిచారు..

పత్తి రైతులకు శుభవార్త!
• 2025–26 పత్తి సీజన్‌కి సిద్ధమైన సీసీఐ
• దేశవ్యాప్తంగా 122 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
• MSP ధరలపై పత్తి కొనుగోలు నిర్వహణకు ప్రణాళిక
• నవంబర్ 21 నుంచి కొనుగోలు ప్రారంభం
• తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు సిద్ధం
• సీసీఐ ప్రత్యేక బృందాలు ఏర్పాటులో
• పత్తి రైతుల ప్రయోజనాల కోసం కేంద్రం పునరాలోచన
• ప్రతి జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు దిశానిర్దేశాలు
• సీసీఐ ప్రత్యేక యాప్‌ ద్వారా రైతులకు సమాచారం
• దేశవ్యాప్తంగా పత్తి కొనుగోలు కోసం ఏర్పాట్లు

Exit mobile version