Hyderabad: మల్కాజిగిరి పరిధిలోని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అర్ధరాత్రి సుమారు రెండు గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దమ్మాయిగూడ నివాసి అయిన మీన్ రెడ్డిని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుకున్నారు. అతనికి బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో 120 రీడింగ్ రావడంతో ఆటోను సీజ్ చేశారు. ఇక, పోలీసులు తన ఆటోను సీజ్ చేయడంతో పాటు ఆటో మీన్ రెడ్డిని మందలించినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ కేసు పరిష్కారం వరకు కోర్టుకు హాజరైన తర్వాతే ఆటోను తిరిగి అప్పగిస్తామని పోలీసులు చెప్పడంతో మీన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
Read Also: Minister kollu Ravindra: జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్.. ఎక్కడ రైతులు కనిపించలేదు..
ఈ పరిణామాల నేపథ్యంలో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే మీన్ రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వ్యవహరించిన తీరుపై మనస్తాపం చెందడం వల్లే మీన్ రెడ్డి ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మీన్ రెడ్డి ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
