New IT Park In HYD: సింగపూర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటల్‌ల్యాండ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో హైదరాబాద్‌లో అత్యాధునిక 1 మిలియన్ చదరపు అడుగుల పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ. 450 కోట్ల పెట్టుబడిని క్యాపిటల్‌ల్యాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ ఖియాతానీ ప్రకటించారు. ఇక, వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధిని మరింత బలోపేతం చేయడంతో పాటు రాబోయే కొత్త ప్రాజెక్ట్ గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్లు (GCCS), ప్రీమియం సౌకర్యాలను కోరుకునే బ్లూ-చిప్ కంపెనీల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగలదు అన్నారు.
Read Also: Saif Ali Khan : సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్.
ఇక, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. క్యాపిటల్‌ల్యాండ్ గ్రూప్ పెట్టుబడి నిర్ణయాన్ని స్వాగతించారు. వ్యాపార, సాంకేతిక హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణించారు. క్యాపిటల్ గ్రూప్ విభిన్నమైన పోర్ట్‌ఫోలియో రిటైల్, ఆఫీస్, లాడ్జింగ్, లాజిస్టిక్స్, డేటా సెంటర్‌లను విస్తరించిందన్నారు. అలాగే, హైదరాబాద్ లో అంతర్జాతీయ టెక్ పార్క్ హైదరాబాద్ (ITPH), అవాన్స్ హైదరాబాద్, సైబర్‌పెర్ల్ అనే మూడు వ్యాపార పార్కులను నిర్వహిస్తోంది. కాగా, క్యాపిటల్‌ల్యాండ్ గతంలో ప్రకటించిన 25 ఎండ్య్లూ ఇట్ లోడ్ డేటా సెంటర్ హైదరాబాద్‌లో 2025 మధ్య నాటికి పని చేయడానికి సిద్ధంగా ఉంది.. ఇది భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం హైదరాబాద్ కీలకం కానుంది. దీంతో పాటు ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ (ఐటీపీహెచ్)లో రెండవ దశ పునరాభివృద్ధి ఈ ఏడాది స్టార్ట్ అయి.. 2028 నాటికి పూర్తి కానుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.