Site icon NTV Telugu

MLC Pochampally: పోలీసుల విచారణకు హాజరైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి..

Pochampally

Pochampally

MLC Pochampally: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. కాసేపట్లో పోలీసులు ఎమ్మెల్సీ పోచంపల్లిని విచారణ చేయనున్నారు. ఇక, ఫిబ్రవరి 11వ తేదీన తోల్ కట్ట గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ దాడులు చేసింది. ఈ దాడుల్లో 64 మందిని అదుపులోకి తీసుకుంది. ఫామ్ హౌస్ లో కోళ్ళ పందాలు ఆడుతున్న వారితో పాటు 64 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే, ఫామ్ హౌస్ ను తాను లీజుకి ఇచ్చానని పోలీసులకు ఎమ్మెల్సీ పోచంపల్లి తెలిపారు. లీజు డాక్యుమెంటన్లను సైతం ఇప్పటికే పోలీసులకు అందజేశారు. కాగా, లీజు డాక్యుమెంట్లపై కొన్ని అనుమానాలు ఉండటంతో విచారణకు హాజరుకావాలంటూ మరోసాని గురువారం నాడు నోటీసులు జారీ చేశారు.

Read Also: Bandi Sanjay: హోలీ సంబరాల్లో పాల్గొన్న కేంద్రమంత్రి బండి సంజయ్..

ఇక, ఈరోజు మొయినాబాద్ పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు అయ్యేందుకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. కాగా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు విచారణకు భూపతి రాజు రాందేవ్ రెడ్డి, రమేష్ రెడ్డిలు హాజరయ్యారు. అయితే, ఇప్పటికే ఎమ్మెల్సీ పోచంపల్లిపై గేమింగ్ యాక్ట్ లోని మూడు నాలుగు సెక్షన్లతో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. ఫాంహౌస్ లో తనిఖీలు చేసిన సమయంలో 46 కోడి కత్తులతో పాటు బెట్టింగ్ కాయిన్స్, కార్డులు, 64 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version