Site icon NTV Telugu

MLA Prakash Goud: బీఆర్‌ఎస్‌కు మరో భారీ షాక్‌.. నేడు కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే..

Mla Prakash Goud

Mla Prakash Goud

MLA Prakash Goud: గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో చేరేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశ్‌ గౌడ్‌ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇవాల తిరుపతి నుంచి నేరుగా సీఎం రేవంత్ నివాసానికి ప్రకాశ్‌ గౌడ్ రానున్నారు. నేడు సాయంత్రం 7 గంటలకు సీఎం రేవంత్, పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రకాశ్ గౌడ్‌తో పాటు మరో ఇద్దరు మున్సిపల్ ఛైర్మన్లు కూడా హస్తం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షంలో అరికపూడి గాంధీ చేరనున్నట్లు సమాచారం.

Read also: MLC Kavitha: నేడు కవిత.. లిక్కర్, సీబీఐ కేసు విచారణ..

ఇటీవలి కాలంలో పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన 7 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ప్రకాశ్‌ గౌడ్‌ చేరితే కాంగ్రెస్‌లోకి వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 8 కి చేరుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది బీఆర్‌ఎస్ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జెడ్పీ చైర్మన్, మున్సిపల్ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. జిల్లా స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Delhi Liquor Case: నేడు కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు..

Exit mobile version