NTV Telugu Site icon

Gudem Mahipal Reddy: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో గూటికి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?

Gudem Mahipal Reddy Revanth Reddy

Gudem Mahipal Reddy Revanth Reddy

Gudem Mahipal Reddy: లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం కొనసాగుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆరి కేపూడి గాంధీ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే గులాబీ పార్టీకి మరో షాక్ తగలనుంది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలవడంతో ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2014 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు.

Read also: Liquoe Parties: దావత్‌లపై ఆబ్కారీశాఖ ఫోకస్.. రాష్ట్రంలోని లిక్కర్ మాత్రమే అనుమతి..

ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ ను కలవడంతో ఆయన కూడా పార్టీలోకి జంప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి మరో ఐదు మంది ఉప్పల్, ఎల్బీనగర్, ముషీరాబాద్, అంబర్పేట్, జూబ్లీహిల్స్ కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కాలేరు యాదయ్య, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ త్వరలో ఖాళీ కానున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము బీఆర్‌ఎస్‌ను వీడి అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరామని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
Peddamma Thalli Temple: పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనం శాకాంబరి ఉత్సవాలు.. రెండో రోజు ఇలా..